ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. TSNPDCL : వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వివరాల్లోకెళ్తే..
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 100 విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు (జయశంకర్-భూపాలపల్లి స్థానికం), కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల (కరీంనగర్ నుండి స్థానికం), ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, & కుమురం-భీం ఆసిఫాబాద్ జిల్లాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌లో పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: (ఫీజు చెల్లింపు): ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ.200/- చెల్లించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం (రూ. రెండు వందలు మాత్రమే) రుసుము. ఇది కాకుండా, దరఖాస్తుదారులు రూ.120/-(ఒకటి రూపాయలు చెల్లించాలి. పరీక్ష రుసుము వైపు నూట ఇరవై మాత్రమే. అయితే SC/ST/BC/EWS (ఆర్థికంగా బలహీన వర్గాలు)కి చెందిన దరఖాస్తుదారులు కమ్యూనిటీలు, PH మరియు ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ఫీజు ప్రారంభతేదీ: ఏప్రిల్ 10, 2023 దరఖాస్తులు ప్రారంభతేదీ: ఏప్రిల్ 10, 2023 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: ఏప్రిల్ 29, 2023 (సాయంత్ం 5 గంటల వరకు) దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 29, 2023 (రాత్రి 11.59 వరకు)
దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ : 2023 మే 2 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ తేదీ: మే 22, 2023 పరీక్ష తేది: మే 28, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://tsnpdcl.in/Careers
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments