ePaper
Friday, March 20, 2026
📄 ePaper

స్క్రాప్ వాహనాల బహిరంగ వేలం పూర్తి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

– – బహిరంగ వేలానికి భారీగా స్పందన

— 116 వాహనాలను 5 లాట్స్ గా విభజించగ, రూ.10,07,000/- లకు కొనుగోలు చేసిన ఔత్సాహికులు….
— వేలం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

పోలీసుల అధీనంలో ఉన్న అన్నోన్/ స్క్రాప్ ( ఎందుకూ ఉపయోగపడని) వాహనాల బహిరంగ వేలం శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలంపాటానికి ప్రజలు, వ్యాపారులు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా తెలియజేసిన విధంగా పోలీసుల ఆధీనంలో ఉన్న ఎవరు గుర్తించినటువంటి, ఎవరికి సంబంధించినవో తెలియని, ఎవరు తీసుకొని వెళ్ళని వాహనాలను ప్రభుత్వం ఆదేశానుసారం ఆరు నెలల గడువు మే 30తో ముగిసింది.

కావున ఎవరు స్పందించనందున వాటిని ఈరోజు సానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ద్వారా నియమించబడిన కమిటీ నిర్ణయించిన 116 వాహనాలను 5 లాట్స్ ( భాగాలుగా) విభజించడం జరిగింది. మొదటి నాలుగు లాట్స్ లో ప్రతి లాట్ నందు 27 ద్విచక్ర వాహనాలు ఉంటాయని, ఐదవ లాట్ నందు 5 ఆటోలు,2 కార్లు,1 వ్యాన్ గా కమిటీ నిర్ణయించింది.

*5 లాట్స్ ను కొనుగోలు చేసిన వారి వివరాలు.*

1) ఎం డి ఫయాజ్ s/o నిజాముద్దీన్ – మొదటి లాట్ ను రూ 2,00,000/- లకు కొనుగోలు చేశారు.

2) సయ్యద్ రియాజుద్దీన్ s/o మంజూరుద్దీన్ –
*) రెండవ లాట్ ను రూ 2,01,000/- లకు
*) మూడవ లాట్ ను రూ 2,00,000/- లకు
*) నాలుగవ లాట్ ను రూ 2,22,000/- లకు
చొప్పున మూడు లాట్ లను ఒకరే కొనుగోలు చేశారూ.

3) ఐదవ లాట్ ను రూ 1,86,000/- లకు మహమ్మద్ అహ్మద్ అలీ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

మొత్తం 108 ద్విచక్ర వాహనాలను నాలుగు లాటుగా విభజించడం మరియు 5 ఆటోలు, రెండు కార్లు, ఒక వ్యాన్ ను ఒక లాటుగా విభజించి వేలం పాట నిర్వహించగా అందులో మొత్తం వాహనాలకు సంబంధించి రూ 10,07,000/- డబ్బును కొనుగోలు దారులు చెల్లించి వాహనాలను తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ వేలంపాటలో జిల్లా ఎస్పీ ద్వారా నియమించబడిన కమిటీ సభ్యులు అయిన ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, పట్టణ డిఎస్పి వి ఉమెందర్, ఏఆర్ డిఎస్పి ఎం విజయ్ కుమార్, ఒకటవ పట్టణ సీఐ పి సురేందర్, ఉట్నూర్ సిఐ సైదారావు, పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి ఎం డి యునుస్ అలి, ట్రాఫిక్ సిఐ కె మల్లేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, బి సూపరిండెంట్ ఏవిఎన్ చారి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!