📰 ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన కార్యక్రమం
📰 స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు లిటిల్ స్టార్ హై స్కూల్ నందు జరిగిన అవగాహన కార్యక్రమం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పేర్కొన్నారు.

బుధవారం రోజు ఉదయం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు లిటిల్ స్టార్ హై స్కూల్ నందు ఏ హెచ్ టి యు ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్, బాల కార్మికులు, వీధి పిల్లలు, బిచ్చగాళ్ళ పిల్లల పై, ఫోక్సో చట్టాలపై, పిల్లల కిడ్నాపింగ్ అక్రమంగా దత్తత తీసుకోవడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ హెల్ప్ లైన్ 181 మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, డయల్ 100 యొక్క ప్రాముఖ్యత తదితర అంశాలపై సమగ్రంగా అవగాహనను ఇరు కళాశాలల పాఠశాల విద్యార్థులకు పూర్తి అవగాహనను కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, స్కూలు పిల్లలు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments