ఎమ్మెల్యే వర్గానికి… ఎంపీ వర్గం ఘాటైనా రిప్లై…
ఘాటు వాఖ్యలతో ఎమ్మెల్యే వర్గం కన్వీనర్ల కు రిప్లై ఇచ్చిన ఎంపీ అనుచరులు…
తెరాస కన్వీనర్లు అంటే కమిషన్ ఎజెంట్లు….
రోజు రోజు కు వేడుక్కుతున్న బోథ్ పాలిటిక్స్….
ప్రతిపక్షం అవసరం లేకుండానే స్వపక్షం లోనే విపక్షాల కంటే పదునైన విమర్శలు…
రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం లేని బ్రోకర్ నాయకుల్లారా నోరు అదుపులో పెట్టుకోండని ఇచ్చోడలో బీ.ఆర్.ఎస్ నాయకులు సొనకాంబ్లే కృష్ణ కుమార్ అన్నారు. ఇచ్చోడా లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే వర్గానికి రిప్లై ఇస్తూ…. 21న మాజీ మంత్రి గోడం నగేష్ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో అసలు జరిగిందేమిటి? బయట ఊహించుకుంటున్నదేంటిది అని, కొంతమంది మా పార్టీలోని బీ.ఆర్.ఎస్ నాయకులు ఎమ్మెల్యే కు బ్రోకర్ గా వ్యవహరించేవారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నగేష్ ను విమర్శించడం అంటే సూర్యునిపై ఉమ్మేశి తన ముఖంపై పడేలా వేసుకున్నట్టు విస్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అసలు ఆరోజు జరిగిందేమిటి!? ఎమ్మెల్యే గురించి మాట్లాడిందేమిటి ఏమిటి….? ఆయన పేరు ఉసేత్తకుండా ఏదేదో జరిగిపోయింది అని ఉలిక్కిపడ్డ నాయకుల్లారా! ముందు మీ అవినీతి దంధాలను సరిదిద్దుకోండి అని హెచ్చరించారు. ఒక నాయకుడి పై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు లేకుండా నిరాధారంగా మాట్లాడితే అజ్ఞానులని తెలిసిపోయిందని స్పష్టం అవుతుంది అన్నారు. బోథ్ నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలుగా అవినీతి రహిత నియోజకవర్గంగా పెరున్న నియోజకవర్గానికి ఇటీవల న్యూస్ పేపర్ లో , ఛానెల్ లో వస్తున్న వార్తలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
వాస్తవం కాకుంటే ఎందుకు ఖండించలేదు. ఎమ్మెల్యే ఖండించలేందంటే పథకాల్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే గా ? అని ప్రశ్నించారు. ఖబర్దార్ అని అనే ముందు ఊహించుకోండి మిమ్ముల్ని ఇప్పటికే అనేక సార్లు అనేక గ్రామాల్లో ప్రజలు అడుగు పెట్టగానే తరిమికొట్టారు గుర్తు చేసుకొండని అన్నారు.
బజార్ హతనూర్ సీనియర్ నాయకులు భూమన్నా మాట్లాడుతూ ఈ కన్వీనర్ లు అంటే కమిషన్ ల కన్వీనర్ లు గా పేరుందని దీనికి మేము నిరూపించడానికి షిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎం.ఎల్.ఏ రండి మేము ప్రూవ్ చేస్తాం రాజారాం అంటే కమిషన్ ఏజెంట్ మాత్రమే అని పార్టీని సర్వ నాశనము చేస్తున్నాడని అన్నారు. ఎం.ఎల్.ఏ మీ తీరును మార్చుకోండి…. గ్రూప్ లు చేసింది మీరేనని అన్నారు.
బోథ్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ* బోథ్ కన్వీనర్ రుక్మన్ సింగ్ ఎక్కడ ఉద్యమం చేశాడో కానీ సోనాలలో చని పోయిన *తెలంగాణ ఉద్యమకారుడికి* వచ్చిన ఆర్థిక సహాయంతో కమిషన్ తీసుకున్నది వాస్తవం కాదా అని… నిరూపిస్తామని సవాల్ విసిరారు.
బ్రోకర్ నయకుల్లారా పద్ధతి మార్చుకోండి మాకు ఖబర్దార్ అనడానికి మీకెన్ని గుండెలున్నాయి, తిరగనియడం గురించి మాట్లాడుతున్న వారు టైం, డేట్ చెప్పండి మీ గ్రామాల్లో వస్తాం లేదా మీరు మా గ్రామాల్లో ఎప్పుడు వస్తారో చెప్పండి మా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మెలగాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుకొంటారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోథ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ , నాయకులు జుగాదిరావు, ఇచ్చోడ, సీరికొండ సర్పంచుల సంఘం అధ్యక్షులు పాండురంగ్, పెంటన్న, గుడిహతనూర్ మాజీ ఎంపీపీ, మా. ఏ ఎంసీ ఆడే శిలా, నాయకులు సుధాకర్ రెడ్డి, నేరేడిగొండ, బజార్హతనూర్ మండల సహకార సంఘం అధ్యక్షులు మందుల రమేష్, వెంకన్న, నాయకులు గాదె శంకర్ , పివి రమణ, వెంకన్న , నాయకులు పెందుర్ తులసిరాం, అల్కా గణేష్, కొత్త శంకర్, నానం రమణ, ఎంపీటీసీ భీంరావు, సర్పంచ్ లు సుభాష్ పాటిల్ , గంగారాం, నాయకులు నరాల శ్రీనివాస్ అభిమాన్, ఎస్ కె మహమూద్ , రంజానీ, కేశవ్, మోసిన్, జైవంత్ రావు, మెశ్రం జైవంత్ రావు తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments