మాదాపూర్ లో చోరీ విఫలయత్నం
ఆందోళన చెందుతున్న గ్రామ ప్రజలు
బైక్ పై పరారైన దొంగలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: జిల్లా లోని ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామంలో బైక్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చోరీకి యత్నించే క్రమంలో స్థానికులు అరవడంతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై పరారయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాజీ అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి యత్నించగా అప్రమత్తమైన మహిళ అరవడంతో తన కుటుంబ సభ్యులు వచ్చి ఆ వ్యక్తులను పట్టుకునే క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తిని నెట్టేసి బైక్ పై పొన్న ఎక్స్ రోడ్ వైపు పరారైనట్లు స్థానికులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఇచ్చోడ మండలంలోని విద్యానగర్ లో చోరీ విఫలయత్నం జరగిన విషయం తెలిసిందే. అలాంటి సంఘటననే మాదాపూర్ లో చోటుచేసుకునడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Recent Comments