🔶 మంటల్లో నాలుగు ఇండ్లు దగ్ధం
🔶 బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
🔶 అండగా ఉంటామని హామీ….
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాపూర్ పరిధిలోగల మురళి నగర్ తండాలో బుధవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంటలు చెలరేగి నాలుగు ఇండ్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో రెండిండ్లు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకుంటున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి తక్షణ సహాయంగా 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందించి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని, జరిగిన నష్టాన్ని అధికారులు తక్షణమే అంచనా వేసి ప్రభుత్వ పరంగా ఎలాంటి జాప్యం లేకుండా చూసి బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments