– సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్
* పేకాట ముక్కలు, రూ 79,500/- నగదు,10 మొబైల్ ఫోన్లు స్వాధీనం.….
*ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.…
ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపలనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు సాయంత్రం సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ గారికి వచ్చిన విశ్వసనీయ సమాచార మేరకు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపెల్లి ఏరియా నందు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పదిమంది పట్టుబడ్డారని తెలిపారు.
వారి వద్ద నుండి పది మొబైల్ ఫోన్లు, పేకాట మొక్కలు, రూ.79,500/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వారిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన వారిలో పేర్లు 1) మహేందర్ , 2) రాజేష్ , 3) అనిల్ ,4) సందీప్, 5) శంకర్, 6) వినోద్ రెడ్డి, 7) రవీందర్ , 8) రమేష్ , 9) లక్ష్మన్న , 10) జితేందర్ లు ఉన్నట్లు తెలిపారు.
ఇది మన సామాజిక బాధ్యత – రిపబ్లిక్ హిందూస్థాన్ సూచన …
Note : మీ చుట్టూ జరిగే అన్యాయాలు, అవినీతి, వడ్డీ వ్యాపారుల వివరాలు నేరుగా *మెసేజ్ యువర్ ఎస్పీ* పేరిట మన జిల్లా డైనమిక్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నెంబర్ : 8712659973
Recent Comments