🔶 మార్చ్ 31తో ముగుస్తున్న వెసులుబాటు…
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు విధించినటువంటి ట్రాఫిక్ ఈ చలాన్ లకు డబ్బులు కట్టే విషయంలో పోలీసు శాఖ వారు డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సదవకాశం ఈనెల మార్చి 31 తారీకు వరకు ఉంటుందని, తదుపరి ఈ డిస్కౌంట్ వర్తించదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ వెసలుబాటు ఈ క్రింది విధంగా ఉంటుంది అని తెలిపారు.
1.ద్విచక్ర వాహనదారులు మరియు ఆటోలు వారికి విధించినటువంటి e challan ఫైన్ లో 25 శాతం కడితే మిగిలిన 75 శాతం మాఫీ అవుతుంది.
2. నాలుగు చక్రాల వాహనాలు/ కార్లు 50% ఫైన్ అమౌంట్ కడితే మిగిలిన 50 శాతం మాఫీ అవుతుంది.
3. తోపుడు బండ్లు మరియు ఇతర చిల్లర వ్యాపారస్తులకు ఉన్న ఫైన్ లో 25 శాతం మిగిలిన 75 శాతం మాఫీ అవుతుంది
4. కరోనా లాక్ డౌన్ సమయంలో మాస్క్ లేకుండా తిరుగుతున్నట్టు వంటి వారికి విధించిన ఫైన్ లో 100 రూపాయలు కడితే మిగిలిన 900 రూపాయలు మాఫీ అవుతుంది.
కాబట్టి ప్రజలు/ వాహనదారులు వారికి ఉన్నటువంటి ఈ చలాన్ లు ఈ నెల 31 వ తారీకు వరకు క్లియర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వాహనదారులు/ప్రజలు మీ వాహనాలపై ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు త్వరగా క్లియర్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.చలానా డబ్బులు కట్టడానికి ఆన్లైన్లో http://echallan.tspolice.gov.in ద్వార కానీ, గాని లేదా మీ సేవ సెంటర్ లో సంప్రదించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తారీకు నుండి ఇప్పటివరకు 49,493 ఈ చలాన్ కేసులకు సంబంధించిన రూ 55,90,410/- లను జిల్లా ప్రజలు చెల్లించి తమ చలాన్ లను క్లియర్ చేసుకోవడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకొని మీ పెండింగ్ క్లియర్ చేసుకోవాలని సూచించారు.
Recent Comments