పలు మండలాల్లో పాఠశాలలు , ఆసుపత్రులు , చౌక ధరల దుకాణాలు సందర్శన….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మరియు చౌక ధరల దుకాణం లను పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కె.తిరుమల్ రెడ్డి, సభ్యులు కె.గోవర్ధన్ రెడ్డి తనిఖీ చేశారు.

ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.పాఠశాలలు , అంగన్వాడి కేంద్రాలు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇచ్చోడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను పరిశీలించారు.

అనంతరం ఇంద్రవెళ్లి మండలంలోని కేస్లాపూర్ అంగన్ వాడీ కేంద్రం, ఇంద్రవెళ్లి లోని చౌకధరల దుకాణం, జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు.


Recent Comments