తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రేవారి లక్ష్మన్న (31) విద్యుత్ షాకు గురై మృతి చెందినట్టు ఎస్సై ధన శ్రీ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రేవరి లక్ష్మన్న బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చేపలు పట్టడానికి ఉండం గ్రామ శివారులోని నల్లగుండ్ల మడుగు వద్దకు వెళ్లగా అక్కడున్నా విద్యుత్ మోటార్ ద్వారా నీటిలోకి విద్యుత్ సరఫరా కావడంతో చేపలు పడుతున్న లక్ష్మన్నకు నీటి ద్వారా కరెంట్ షాక్ తగలడంతో నీటిలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. భార్య రేవని గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
చేపలు పట్టడానికి వెళ్లి… కరెంట్ షాక్ తో ఒకరి మృతి…..
Previous article
RELATED ARTICLES
- Advertisment -


Recent Comments