గెలిచిన ఆరు నెలల్లో ప్రజా మద్దత్తుతో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే మార్గం
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునర్ ప్రారంభం
నిర్మల్ , ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ లో రోడ్డు సమస్యల పరిష్కారం చేస్తాను…
ప్రణాళిక తయారు చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తా..
* ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థి సుభాష్ రాథోడ్
ఆదిలాబాద్ బ్యూరో :
వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ పేర్కొన్నారు గురువారం రోజు ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. సిరికొండ మండలంలోనీ గ్రామాల్లో ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి చేయడానికి పుష్కలమైన వనరులు ఉన్న గెలిచినా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేదని అన్నారు. ఇంకా ఆదివాసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేవని అన్నారు. అత్యధికంగా బోథ్ లో గెలిచిన గోడం నగేష్ తాను సొంతంగా ఎం అభివృద్ది చేసిండో ప్రజలకు గిరిజన ఆదివాసీలకు తెలపాలని అన్నారు. అన్నిగనం సార్లు గెలిచిన ఒక్క పరిశ్రమ కూడా తీసుకరాలేదని , జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని అన్నారు. ఇప్పటిదాకా గెలిచిన నాయకుల అసమర్థత వల్ల ప్రజలు నిత్యం వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
జాతీయ వాదులు గెలవడం కోసం పార్టీలు మారే వారిని కాకుండా పేద ప్రజల కోసం ఒక్కసారి తనను గెలిపించాలని కోరారు.
జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధుల పై ప్రణాళిక తయారు చేసి ఆరు నెలలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్య్రమాలు మొదలు పెడతానని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి అసెంబ్లీ లో ఓటు వేస్తే ఆ పార్టీ ప్రజలను నట్టేట ముంచినది అన్నారు. మహిళకు రూపాయలు 2500 , గ్యాస్ ధర రూ.500 అని చెప్పి ఇప్పటి దాక ఒక్క హామీ మాత్రమే అమలు చేసి మళ్ళీ 25 గ్యారేంటిలతో ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. రైతులకు ఎకరా రూ.15000 వెలు , కౌలు రైతులకు ఇచ్చిన గ్యారంటీల పై ఏమైందని అన్నారు. గెలిచిన వెంటనే మొదటి సంతకం రైతు రుణ మాఫీ పై ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
ఆదిలాబాద్ సిమెంట్ కర్మాగారం , ఆదిలాబాద్ వయ ఆర్మూర్ రైల్వే మార్గం తన వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే గతంలో గోడం నగేష్ ఎంపిగా ఉన్న సంగతి మర్చిపోవద్దని , అప్పుడు రైల్వే ఎందుకు తీసుకారాలేదని అన్నారు.
ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ రాథోడ్ రాందాస్, ఎల్ శేష్ రావ్ , దత్త, సాయి, సంతోష్ , గోవింద్ , కుంబేవాద్ శంకర్, బాలాజీ తదితరులు పాల్గోన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments