Friday, November 22, 2024

ఆదివాసీలు విద్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించాలి – ఎస్పీ 

*సిరికొండ మండలం కన్నపూర్ గ్రామం నందు ఆదివాసీలకు మెగా ఉచిత వైద్య శిభిరం ప్రారంభించిన జిల్లా ఎస్పీ

*పోలీసులు మీకోసం లో భాగంగా ఆదివాసీలకు మెగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు

*20 మారుమూల ఆదివాసి గ్రామాల 400 ఆదివాసీలకు వైద్య సదుపాయం అందజేత

*రిమ్స్, ఉట్నూర్ పి హెచ్ సి నుండి 13 మంది నిష్ణాతులైన డాక్టర్ల చే అందించిన వైద్య సేవలు

*ప్రతీ ఒక్క ఆదివాసి యువత ఏదైనా ఒక ఉద్యోగాన్ని క్రమం తప్పకుండా నిర్వర్తించాలి

 ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామం నందు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం అనే కార్యక్రమం ద్వారా మారుమూల ఆదివాసీలకు వైద్య సదుపాయాలను అందించాలని సదుద్దేశంతో *మెగా ఉచిత వైద్య శిబిరాన్ని* జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం నందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా మరియు ఉట్నూర్ పీహెచ్సీ ద్వారా నిష్ణాతులైన కార్డియాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, ఈఎన్టి, పీడియాట్రిషన్, డెంటల్ తదితర అంశాలకు సంబంధించిన వైద్యుల బృందం ద్వారా ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ శిబిరం నందు ఇంద్రవెల్లి మరియు సిరికొండ మండలాల 20 గ్రామాలకు సంబంధించిన 400 మంది ప్రజలు, ఆదివాసీలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మొదటగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వైద్యాలలో స్వాగతం పలికి శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోనికి పోలీసులు నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆదివాసీలలో ముఖ్యంగా యువత చదువును మధ్యలోనే ఆపేసి గ్రామాలలో ఖాళీగా సంచరించడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సదవకాశాలను వినియోగించుకొని ఉద్యోగాలలో చేరి గ్రామాలను ముఖ్యంగా తమ కుటుంబాలను అభివృద్ధి బాటలో యువత తీసుకువెళ్లడానికి కృషి చేయాలని సూచించారు. విద్య, వ్యవసాయం వ్యాపార రంగాలతోటే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు ఉన్నత చికిత్స కోసం ఎటువంటి సహాయ సహకారాలైన పోలీసు వ్యవస్థ నుండి లభిస్తాయని హామీ ఇచ్చారు. వైద్య శిబిరం నందు డాక్టర్లచే సూచించిన మందులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, సిఐలు ఎం నైలు ఐ సైదారావు, ఎస్సైలు డి సునీల్, నీరేశ్, వైద్య సిబ్బంది డాక్టర్లు దీపక్ పుష్కర్, వీణ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి