దళారుల నిలువు దోపిడీ పై కొరవడిన అధికారుల నిఘా….!?
Thank you for reading this post, don't forget to subscribe!తేమ పేరిట నిలువు దోపిడీ…. గత్యంతరం లేక నష్ట పోతున్న రైతన్న
గల్లీకొక సొయాకొనుగోలు దుకాణం…..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటను రైతన్నల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం రైతుల పంట అమ్మకాల కోసం సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడంతో దళారులకు ఇదే వరంగా మారింది. ప్రభుత్వ ధరకు అధిక రేటులో కొంటున్నామని చెబుతూనే తేమ నాణ్యత పేరిట నిలువునా దళారులు దోచుకుంటున్నారు . అధికారులు ఈ ఇటు వైపు దృష్టి సారించాల్సింది పోయి ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధరకు కొంటున్నారు అని దళారుల దోపిడీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అదే విధంగా రైతుకి మేలు జరుగుతుందని చెప్పడం గమన్హారం. జిల్లా వ్యాప్తంగా చోటామోటా వ్యాపారి కూడా వేయి క్వింటాళ్ల సోయాను ఒక ఐదు రోజుల్లో కొంటున్నాడు అంటే అర్థం చేసుకోండి , రైతుల్ని ఏ స్థాయిలో దోచుకుంటున్నారో. ఇచ్చొడ మండల కేంద్రం చిన్న వ్యాపారి ఒకరు నాణ్యత లేదు అంటూనే సుమారు పదిరోజుల్లో 700 క్వింటాళ్ల సోయను కొనుగోలు చేశారు. 30 నుండి 40 కొనుగోలు దుకాణాలు ఉన్నాయంటే వారి కొనుగోలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మండలంలో గల్లికొక ఖరీదు దుకాణం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలను గాలి వదిలేస్తున్నారు. వ్యాపారులు సొయా కు క్వింటాలు కు ధర రూ.5 వేలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుని, తరువాత తేమ పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు.
దళారులు పంట కొనుగోలు చేయడం లో ప్రభుత్వం నిబంధనలు ఏమిటి అనే విషయం తెలుసు కోవడం కోసం రెండు రోజుల క్రితం ఇచోడా మార్కెట్ కార్యాలయానికి వెళ్లగా సెక్రెటరీ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తే, ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని రైతులు మాట్లాడుకుంటున్నారు.
Recent Comments