నిందితుడు షేక్ కలీం
Thank you for reading this post, don't forget to subscribe!మంత్రాల నేపంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి బాల్పడ్డ బాబా అరెస్ట్, రిమాండ్ తరలింపు
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
నిందితునిపై ఫోక్సో కేసు
ప్రజలు మంత్రాలను, తంత్రాలను, బాబాలకు నమ్మవద్దని పోలీసుల సూచన
– – ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్
రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనర్ బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండటంతో, తన స్నేహితురాలు తండ్రి మంత్రాలతో, తంత్రాలతో తాయిత్తులతో నయం చేస్తానని నమ్మబలికి, బాధితురాలితో సహా బాధితురాలీ కుటుంబ సభ్యులను ఈనెల 9వ తారీఖున నిర్మల్ జిల్లా సోన్ నది సమీపంలో పలు పూజా కార్యక్రమాలు చేసి తిరిగి 11 వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలోని బాధితురాలి స్వగృహానికి తీసుకెళ్లడం జరిగింది.

అదే రోజు రాత్రి నిందితుడు షేక్ కలీం బాధితురాలి ఇంట్లో బస చేసి, పూర్తిగా నయం కావాలంటే ఈరోజు రాత్రి ఒంటరిగా బాధితురాలితో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నమ్మబలికి కుటుంబ సభ్యులను వేరే గదిలో ఉంచి రాత్రి సమయంలో బాధితురాలు పై లైంగికంగా వేధింపులకు పాల్పడడం జరిగింది.
ఆ సమయంలో బాధితురాలు కి “నీ సమస్యలన్నీ పోతాయి కుటుంబ సభ్యులకు చెప్పిన వారిని చంపేస్తానని” బెదిరించినట్లు మరుసటి ఉదయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా,
వెంటనే ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బాధితురాలి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసిన సందర్భంలో..
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితుడు షేక్ కలీం (మారేగావ్ గాదిగూడ మండలం) పై మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడిన కారణంగా ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు.
ప్రజలు మంత్రాలను, బాబాలను, తంత్రాలను నమ్మవద్దని, ఎలాంటి వైద్య సమస్యలు ఉన్న నిర్భయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాన్ని సంప్రదించాలని సూచించారు. ఇలాంటి వారి పట్ల ఎవరైనా మోసానికి గురైన యెడల జిల్లా పోలీస్ యంత్రాంగానే నిర్భయంగా సంప్రదించవచ్చని తెలిపారు.
నిందితు *షేక్ కలీం* పై దర్యాప్తు కొనసాగుతుందని అతని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
Recent Comments