Tuesday, October 14, 2025

కులం పేరుతో దూషించి , గొడ్డలితో దా*డి చేసిన వ్యక్తి కి జైలు శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  షెడ్యూల్ ట్రైబ్ (ఆదివాసి)  వ్యక్తిని కులం పేరుతో దూషించి గోడ్డలితో కొట్టిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష మరియు రూ 2000/- జరిమానా విధించినా ఎస్సీ,ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కుమార్ వివేక్ సోమవారం రోజు తీర్పు వెలువరించారు.

కేసు సంబంధించిన వివరాలు….
జైనథ్ మండలానికి చెందిన గూడ గ్రామస్థుడు బాధితుడు మడవి రాజు మరియు తన భార్యతో కలిసి తేదీ 31.01.2022 రోజున ఉదయం తన బంధువుల ఇంటికి పిట్టగూడా గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో గూడ గ్రామానికి వస్తుండగా అదే గ్రామస్తుడు నిందితుడు *బండారి దేవన్న* (62) s/o రాములు అనే వ్యక్తి దారికి అడ్డుగా వచ్చి మద్యం తాగడానికి డబ్బులు అడగగా, నా దగ్గర లేవు రేపు ఇస్తాను అని తిరిగి వెళుతుండగా, గోండోడ (కులాన్ని చెబుతూ అవమానించి) డబ్బులు ఇవ్వు అని తిట్టినాడు. ఇంకా గొడ్డలి పట్టుకొని వచ్చి తనను వెనక నుండి కొట్టగా తన కుడి కన్ను కనత భాగంలో దెబ్బ తగిలి గాయం కాగా వెంటనే మడావి రాజు 108 అంబులెన్స్ లో రిమ్స్కు తరలించి చికిత్సను అందించినారు.

మడావిరాజు దరఖాస్తు మేరకు అప్పటి జైనథ్ ఎస్సై బిట్ల పెర్సస్ కేసు నమోదు చేయగా డిఎస్పి వి ఉమేందర్ దర్యాప్తు చేసి సెక్షన్ 294 బి 324 ఐపిసి 3 (1)(r)(s) 43 (2)(va) 7 ఎస్సీ ఎస్టీ ఆక్ట్ నందు కేసు నమోదు చేయగా చార్జిషీటు దాఖలు చేయగా.

ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి 12 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా ప్రత్యేక న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టు కుమార్ వివేక్ తీర్పును వెలువరిస్తూ బండారి దేవన్న కు పైన సెక్షన్ 324 ఐపిసి కింద ఆరు నెలల పాటు సాధారణ జైలు,రూ 500/- జరిమానా, 3(1)(2) ప్రకారం ఆరు నెలలు మరియు 2000 రూపాయల జరిమానా, 3 (1)(s) ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష రూపాయలు 500 జరిమానా, మొత్తం అన్ని సెక్షన్లకి కలిపి ఆరు నెలల జైలు శిక్ష ,  రూపాయల జరిమానా విధించారు.

ఇట్టి కేసు నందు కోర్టు డ్యూటీ అధికారి ఎంఏ జమీర్, జైనథ్ సిఐ డి సాయినాథ్, కోర్టు లైసెన్ధికారి పండరి సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!