రియాద్, సౌదీ అరేబియా – SATA (Saudi Arabia Telugu Association) వైస్ ప్రెసిడెంట్ శ్రీ Mohammad Nooruddin గారు, తెలుగు గల్ఫ్ కూలీల సమస్యలను పరిష్కరించడానికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాని రాజేందర్ (MLA Naini Rajendher) కి వినతిపత్రం సమర్పించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసుల సమస్యలపై SATA వినతిపత్రం – వరంగల్ ఎమ్మెల్యేకు సమర్పణ
రియాద్, సౌదీ అరేబియా:
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) వైస్ ప్రెసిడెంట్ శ్రీ మొహమ్మద్ నూరుద్దీన్ ,, తెలుగు గల్ఫ్ కూలీల సమస్యలను పరిష్కరించడానికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా SATA ప్రతినిధులు ముఖ్య సమస్యలను ప్రస్తావించారు:
ఉద్యోగ సమస్యలు: వీసా, ట్రాన్స్ఫర్ మరియు కొత్త నియమాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు
భాషా అడ్డంకులు: అరబిక్ తెలియక ప్రభుత్వ విధానాలను అనుసరించడంలో కష్టాలు
విద్యా సమస్యలు: పిల్లల చదువులో సరైన మార్గదర్శకత లోపం
ఆరోగ్య సమస్యలు: వైద్య సేవలు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు, రక్తదాన శిబిరాల అవసరం
సాంస్కృతిక దూరం: పండుగలు, సంప్రదాయాల నుంచి దూరమవ్వడం వల్ల భావోద్వేగ సమస్యలు
SATA గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సమాజానికి వివిధ రంగాలలో సేవలందిస్తోంది. వీటిలో సాంస్కృతిక, విద్యా, క్రీడా, యువతా కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం, లీగల్ & జాబ్ గైడెన్స్, రక్తదాన శిబిరాలు ముఖ్యమైనవి. తెలుగు భాషా గౌరవం, సమాజంలో ఐక్యత పెంపొందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం.
భవిష్యత్తులో మరింత విస్తృత సేవలందించేందుకు SATA ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని SATA ఫౌండర్ మల్లేష్, రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చతో పాటు కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), పెంటపాటి శ్రీ చరణ్ తదితరులు అభినందించారు.

Recent Comments