— మేనేజర్ పై దాడికి యత్నించిన డ్రైవర్ పై కేసు నమోదు
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్ గా పనిచేసిన ఎ రమేష్ అను వ్యక్తి శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో డిపో మేనేజర్ జలగం విజయ్ వద్దకు తాగిన మైకంలో వచ్చి ఆర్ టి సి ఆఫీస్ వద్ద మెడికల్ చెక్ (ఫిట్నెస్పై) పై లంచాలు తీసుకుంటున్నారని మీరు ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచి టేబుల్ పై పిడికిలితో గుద్దాడు, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు అని ఆర్టీసీ డిపో మేనేజర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆదిలాబాద్ రెండో పట్టణ సీఐ కె శ్రీధర్ తెలిపారు.
డ్రైవర్ తాగి వచ్చి డిపో మేనేజర్ డాడీకి ప్రయత్నం చేయడం తో మేనేజర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయగా ఎం అశోక్ అనే సిబ్బంది ఆర్ టి సి ఆఫీస్ వద్దకు చేరుకోగా, డ్రైవర్ అతనిపై కూడా బీరు బాటిల్ ధ్వంసం చేసి పొడవడానికి ప్రయత్నించినట్లు సిఐ తెలిపారు. మరియు బండ రాయి తీసుకొని కొట్టడానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ నిందితుడి పై 353 ఐపీసి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Recent Comments