రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల జనవరి 8 : హీల్ స్వచంద్ద సంస్థ, గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్ డాక్టర్స్, ప్రముఖ వ్యక్తుల సహకారంతో సున్నం బట్టి ఏరియా శివాజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి రోడ్డు భద్రత క్రికెట్ కప్ 2023 టోర్నమెంట్ లో జిఎస్ఆర్ ఫౌండేషన్ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ రమేష్ బాబు తెలిపినారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ క్రీడాకారులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. రోడ్డుమీద ప్రయాణిస్తున్నప్పుడు కచ్చితంగా మన కోసం ఎదురుచూస్తున్నటువంటి మన కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలని, వేగం కన్న ప్రాణం మిన్న అనే సూక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అలాగే ఎవ్వరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా నిర్వహించుటకు చేయుతనందించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ప్రతి మ్యాచకు లక్కీ డ్రా ద్వారా బక్క విన్నర్ కి హెల్మెట్ అందించడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కార్తికేయ హాస్పిటల్స్ ఇన్చార్జ్ డాక్టర్ రాజ్ కిరణ్, అమృత హాస్పిటల్ డాక్టర్ చరణ్, జిఎస్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఆకనపల్లి సురేష్, బద్రి సతీష్, ఉప్పలపు సురేష్, కిరణ్ కుమార్, శశి తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments