విశాఖపట్నం :
విశాఖ పట్నం లోని గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన బత్తుల నరసింహా రావు అనే వ్యక్తి రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తాటి చెట్ల పాలేనికి చెందిన రమణమ్మ అనే మహిళ కూలిగా పని చేస్తుంది.
గత మూడు రోజులగా జాలరి పేటతో పాటు భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్‌లో పనులు చేస్తున్నా రు.ఈ క్రమంలో శనివారం ఉదయం జోడుగుల్లపాలెం నుంచి సాగర్ నగర్ వైపు బీచ్ రోడ్‌లో వెళ్తుండ గా..జూ పార్కు గేటు దగ్గరకు వచ్చేసరికి, రోడ్డు భారీగా ఎత్తు పల్లంగా ఉంది.
దీంతో రోడ్డు రోలర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. బ్రేకులు కూడా సరిగా పడకపోవడంతో.. కంగారుపడిన డ్రైవర్ నర్సింగ్ రావు వెంటనే రోలర్‌పై తనతో ఉన్న మహిళను దూకేయాలని సూచించాడు.
దీంతో భయంతో ఒక్కసారి గా దూకేసిన ఆమె రోలర్ కింద పడడంతో కాళ్లు నలిగిపోయాయి. మరోవైపు రోడ్డు రోలర్‌ను అదుపు చేసేందుకు డ్రైవర్ నర్సింగ్ రావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డివైడర్ పైకెక్కి అవతలి రోడ్డు వైపు వెళ్లి అదుపుతప్పి బోల్తాపడింది.
దీంతో నర్సింగ రావుపై రోడ్ రోలర్ ఎక్కడంతో అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయా డు. వెంటనే రగంలోకి దిగిన ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, సీఐ ప్రసాద్ రావు గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతంర అధికారులు క్రేన్ సాయంతో బోల్తా పడిన రోలర్‌ను పైకి లేపి అక్కడ నుంచి తరలిం చారు. జూ పార్కుకు అతి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు.
ఒకవేళ జూ గేటు ఎదురుగా ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత మరింత పెరిగేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు..
Recent Comments