epaper
Saturday, January 24, 2026

Flash..Flash : రిమ్స్ ఎదుట రాత్రి పూట జీతాల కోసం ధర్నా…

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

◾️8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించండి
రిమ్స్ ఎదుట రాత్రిపూట ధర్నా చేస్తున్న రిమ్స్ స్టాఫ్ నర్సులు….
◾️వేతనాలు చెల్లించేంతవరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడి…

◾️మద్దతుగా పలు పార్టీల నాయకులు…

◾️ఆర్డిఓ, రిమ్స్ డైరెక్టర్ చెప్పిన ధర్నా కొనసాగిస్తున్న స్టాఫ్ నర్స్ లు….

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :   రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 300 ఓసి ఎస్ లో 42 మంది స్టాఫ్ నర్స్ పనిచేస్తున్నారు. 8 నెలలుగా వేతనాలు అందే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కంటిన్యూ లెటర్ రాలేదని గత ఐదు రోజులుగా డ్రీమ్స్ ఆస్పత్రి ఎదుట స్టాఫ్ నర్స్ ధర్నా నిర్వహిస్తున్నారు.  ఐదు రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్న ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం రాత్రి కూడా  నిర్వహించారు. రాత్రి సమయంలో ధర్నా నిర్వహించవద్దని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ స్టాఫ్ నర్స్ లకు చెప్పిన వాళ్లు వేతనాలు పడేంతవరకు ధర్నా కొనసాగిస్తామని చెప్పారు.  దీంతో చేసేదేమీ లేక జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ తో పాటు ఇతర అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.  అయితే ఆదిలాబాద్ ఆర్డిఓ రాథోడ్ రమేష్ ధర్నా వద్దకు చేరుకొని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.  జిల్లా స్థాయి సమస్య అయితే ఇక్కడే తేల్చేసే వారమని కానీ ఇది రాష్ట్రస్థాయి సమస్యని ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టికి పంపించడం జరిగిందని చెప్పారు.  అలాగే కంటిన్యూ లెటర్ కూడా వస్తుందని చెప్పారు.  మంగళవారం లేదా బుధవారం వరకు వేతనాలు వేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.  ఎంత చెప్పినా స్టాఫ్ నర్స్ లు మాత్రం తమకు వేతనం చెల్లించేంతవరకు ధర్నా కొనసాగిస్తామని పట్టుపట్టారు.  ఇంతకు అధికారులు గంటపాటు స్టాఫ్ నర్స్ లకు చెప్పినప్పటికీ మాకు వేతనాలు కావాలి అంటూ నినాదాలు చేస్తూ చేశారు.  ధర్నా మాత్రం విరమించేది లేదని చెప్పారు. రాత్రి ధర్నా విషయం తెలుసుకున్న జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకురాలు చిట్యాల సువాసిని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాదిక్ ఖాన్ లు ధర్నా స్థలం వద్దకు చేరుకుని ధర్నాకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ 8 నెలలుగా వేతనాలు అందకపోవడం అంటే ఆశ్చర్య పోవాల్సిన విషయం అన్నారు.  గత ఎనిమిది నెలల నుంచి డైరెక్టర్ కానీ డ్రీమ్స్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక నెల వేతన రాకుంటేనే  కుటుంబ పోషణ ఎంతో కష్టమవుతుందని, అలాంటిది ఎనిమిది నెలల నుండి వేతనం రాకపోవడం అంటే కుటుంబ పోషన ఎలా గడుస్తుంది అని ప్రశ్నించారు.  పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు తోపాటు నిత్యవసర సరుకులు కొనుగోలు కూరగాయలు తోపాటు అన్ని రకాల డబ్బు అవసరముంటుందని అని అలాంటిది ఎనిమిది నెలల నుంచి వేతనం రాకుంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్నారు. స్టాఫ్ నర్స్ లో వేతనాలు రావడం లేదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తమకేమీ పట్టనట్టుగా అధికారులు వ్యవహరించడం వల్లనే రాష్ట్రస్థాయిలో కూడా ఇలాంటి పొరపాటు జరుగుతుందని చెప్పారు.  ఒక నెల వేతనం రాకపోతే వెంటనే సంబంధిత అధికారులు రాష్ట్రస్థాయి కార్యాలయానికి వెళ్లి చూసుకోవాలని అలాంటివి రిమ్స్ లో జరగటం లేదని తెలిపారు.

ఏదిఏమైనాప్పటికీ వేతనాలు చెల్లించేంతవరకు నిరసన ధర్నా కార్యక్రమాన్ని విరమింపచేయమని స్టాప్ నర్సులు తేల్చి చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!