Friday, November 22, 2024

‘రియల్ ‘ భూ మాఫియా చేతిలో కీలు బొమ్మల తయారైన అధికార వ్యవస్థ

చర్యలు చేపట్టినట్లు పెట్టిన హెచ్చరిక ఫ్లెక్సీలు తొలగించి యధావిధిగా కొనసాగుతున్న  అక్రమ వెంచర్ అభివృద్ధి పనులు….
డిటిసిపి అనుమతి లేకుండా అక్రమ వెంచర్ల నిర్వహణతో  గ్రామపంచాయతీ కి రావాల్సిన 10 % భూమిని కోల్పోతున్న వైనం….
కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి….

అధికారులు మా జేబులో ఉన్నారు… ఎవరికి బయపడకండి…. ప్లాట్లు కొనండి అని  కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్న రియల్ మాఫియా…..

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అధికార వ్యవస్థ ను చులకన చేసి రియల్ మాఫియా మండలం లో రెచ్చిపోతోంది. ప్లాట్లు కొనే వారికి ఎవరు ఏమి చేయలేరు... దర్జాగా ప్లాట్లు కొనండి అని కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్నారు సదరు రియల్టర్లు ... మేము కింది స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులను మామూలుగానే చూసుకున్నాం....! ఎవరికి బయపడాల్సిన పనిలేదని భరోసా మంత్రం జపిస్తున్నారు  రియల్టర్లు. కేవలం ₹250 రూపాయల ఫ్లెక్సీ కి ఎవరన్న భయపడతారా !? అని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఎదో నామ్ కె వాస్తే మీడియాలో వార్తలు రావడంతో అధికారులు వచ్చి ఫ్లెక్సీ పెట్టారు తప్ప ఇంకోటి లేదని ఖరాఖండిగా కొనుగులుదారులకు  చెబుతున్నారు. మేము ప్రజాప్రతినిధులు గా ఉన్నాం... ఇటు వైపు ఎవరు రారు, అని దర్జాగా దగ్గరుండి అక్రమ వెంచర్లలో ఉన్న మొరం రోడ్ల పై ఎర్ర మట్టి వేసి వెంచర్ ను అందంగా ముస్తాబు చేస్తున్నారు.
టిప్పర్ల ద్వారా వెంచర్లలో రోడ్ల పై మొరం వేస్తున్న దృశ్యం
ప్రజాప్రతినిధులు సైతం ఇందులో భాగస్వాములు కావడంతో మండల స్థాయి అధికారులు అటువైపు గా వెళ్ళడానికి జంకుతున్నారు.
పక్షం రోజుల క్రితం డిఎల్పీఓ ధర్మరాణి సంబంధిత అక్రమ వెంచర్ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టి , అక్రమ లే అవుట్లను ట్రాక్టర్ ద్వారా దున్నివేస్తామని మీడియా ముఖంగా చెప్పారు...
కానీ వారం రోజుల్లోనే సిన్ మారిపోయింది. రియల్టర్లు దర్జాగా  వెంచర్ పనులు ఆగకుండా కొనసాగుతున్నాయి.
అయితే అధికారులు ఇటు వైపుగా చూడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయానికి అర కిలోమీటర్ కూడా దూరం లో లేని అక్రమ వెంచర్ల పై అధికారులు కన్నెత్తి చూడకపోవడం రియల్టర్లు చెబుతున్న దానికి బలం చేకూరుస్తుంది. ఒకప్పుడు జిల్లా అధికారులు ఏదైనా చర్య తీసుకుంటే మాఫియా సంవత్సరాల తరబడి అలాంటి అక్రమ పనుల జోలికి పోకపోతుండే... కానీ తెలంగాణా రాష్ట్రంలో అధికార వ్యవస్థ పక్కదారిపడుతుంది. ప్రభుత్వ నియమాలు , చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు అక్రమార్కులిచ్చే కాసులకు కక్కుర్తిపడి ఇలా అక్రమార్కుల పై చర్యలు తీసుకోవడం లేదని జనం మాట్లాడుకుంటున్నారు. మొదట్లో అక్రమ వెంచర్ల పై యాక్షన్ పేరిట హడావిడి చేసిన అధికారులు ఎందుకు చల్లబడ్డారో ఇప్పటికి అంతుచిక్కడం లేదు. దింతో ప్రజల్లో  అధికార వ్యవస్థ అభాసుపాలవుతోంది. జిల్లా అధికారులు దృష్టి సారించి రేపటి రోజు అమాయక ప్రజలు ప్లాట్లు కొని నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులు కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల పై సైతం కన్నేసి , రెవెన్యూశాఖ లో రికార్డులు తిరగరాసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు వీటి పై దృష్టి సారిస్తే నిజాలు బయటికొచ్చే అవకాశం ఉంది .
దేవేలప్మెంట్ జరుగుతున్న వెంచర్ వద్ద పక్షం రోజుల క్రితం హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న అధికారులు

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి