Thank you for reading this post, don't forget to subscribe!
🔴 ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించనున్న ర్యాలీ రూట్ మ్యాప్ ను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ
🔴 పట్టణంలో జరగనున్న రెండు ర్యాలీల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
గురువారం రామనవమి సందర్భంగా స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించనున్న రామనవమి ర్యాలీల రూట్ మ్యాప్ ను స్వయంగా పట్టణంలో పర్యటించి సిబ్బందికి సూచనలు చేశారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ర్యాలీలు నిర్వహించనున్న కమిటీ సభ్యులతో మీటింగ్ నిర్వహించి ర్యాలీ సందర్భంగా ఇరు వర్గాలకు వారి వారి కేటాయించిన సమయాలలో ర్యాలీలను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ర్యాలీలో డీజే కు అనుమతి లేదని పేర్కొన్నారు,ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు గాని, పాటలు గాని నిర్వాహకులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెండు ర్యాలీల ప్రతినిధులు, ఓ ఎస్ డి బి రాములు నాయక్, డిఎస్పి వి ఉమేందర్, సిఐ కే సత్యనారాయణ, ట్రాఫిక్ సిఐ అశోక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఒకటో పట్టణ పోలీస్ సిబ్బంది ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Recent Comments