రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 5 రోజులలో ( 31.08.2022 నుండి 04.09,2022 వరకు ) ఆకాశము పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధిపతి & ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ ఒక ప్రకటనలో తెలిపారు. 31 వ తేదిన 16 మి.మీ. , సెప్టెంబర్ 01 వ తేదిన 17 మి.మీ. , 02 వ తేదిన 39 మి.మీ. , 03 వ తేదిన 25 మి.మీ మరియు 04 వ తేదిన 52 మి.మీ ల వర్షపాతము లేదా ( తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్ష సూచన కలదు . ) నమోదు కావచ్చునని అన్నారు. గాలిలో గరిష్ట ఉష్ణోగ్రత 34-36 డిగ్రీ సెంటీగ్రేడు గాను మరియు కనిష్ట ఉష్ణోగ్రత 25-27 డిగ్రీల సెంటీగ్రేడుగా నమోదు కావచ్చును . గాలిలో తేమ ఉదయం పూట 86 -87 % గాను మరియు మధ్యాహ్నం పూట 56-60 % వరకు ఉండగలదు . దక్షిణము నుండి ఉత్తరం దిశగా గాలులు గంటకు 5-8 కి.మీ.ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments