ఖమ్మం జిల్లా: జనవరి 10
ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లె మడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..
ఇందిరమ్మ రాజ్యంతో పేదలకు మంచి జరుగు తుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాటలతోనే కాకుండా పేదలకు ఇచ్చిన గ్యారెంటీలను చేసి చూపిస్తుందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సమస్యలు తెలుసుకునేం దుకు ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వస్తారని పొంగులేటి తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తులతో పేదల న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చుతుందన్నారు.
గత ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని మాటలు చెప్పి తప్పించుకునే ప్రభు త్వం కాదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. ఎన్ని అవాంతరాలు ఎదు రైనా పేదలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చు తామని పొంగు లేటి తెలిపారు.
ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments