ఇచ్చోడ సిఐ ఎం నైలు ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో 80 నెంబర్ పలకలు లేని వాహనాలు స్వాధీనం...
Thank you for reading this post, don't forget to subscribe!
వాహన నంబర్ ప్లేట్లను వంచటం, దాచిపెట్టడం లాంటివి చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు : సిఐ
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేనిచో మీరు చిక్కుల్లో పడ్డట్లే.... పోలీస్ యంత్రాంగం నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల పై కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చోడ మండల కేంద్రంలో ఇచ్చోడ సిఐ ముదవత్ నైలు ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందితో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంబర్ ప్లేట్ లేని 80 వాహనాలను పోలీసుస్టేషన్ కి తరలించి నట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భగా సిఐ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు విధిగా నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని అన్నారు. వాహన నంబర్ ప్లేట్లను వంచటం, దాచిపెట్టడం లాంటివి చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్, గుడిహత్నుర్ ఎస్సై ప్రవీణ్ కుమార్, నేరాడిగొండ ఎస్సై సాయన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ కి తరలించిన స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు
Recent Comments