— జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
🔶 కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ
🔶 కేసుల నందు పురోగతిని సిసిటిఎన్ఎస్ నందు త్వరగా అప్లోడ్ చేయాలి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ఆదిలాబాద్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్ల యొక్క కోర్టు డ్యూటీ అధికారులతో (CDO) ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోర్ట్ నందు నిజాయితీగా విధులు నిర్వర్తించి మంచి పేరును సంపాదించాలని సూచించారు. నిజాయితీగా
పనిచేసినంతకాలం తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సూచించారు. అదేవిధంగా ఇదివరకే లోక్ అదాలత్ లో పూర్తి అయిన కేసులను త్వరితగతిన సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. కోర్ట్ నందు ఎన్ని కేసులు డిస్పోజల్ అయినవి, ట్రయిల్ అయినవి తదితర విషయాలను ఎప్పటికప్పుడు తమకు అందించిన టాబ్లెట్ లలో నవీకరిస్తూ ఉండాలి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కేసులలో ప్రత్యేక శ్రద్ధ వహించి కేసును కన్వెన్షన్ దిశగా ప్రోత్సహించాలని, దానికి తగ్గ కృషి చేయాలని సూచించారు. ట్రయల్ నందు వీక్నెస్ కు సరైన అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ నందు ప్రాసెస్ రిజిస్టర్ లను తప్పకుండా నిర్వహించాలని, వర్టికల్ ఇంచార్జ్ డిఎస్పి నారాయణను పోలీస్ స్టేషన్లో నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశం నందు వర్టికల్ ఇంచార్జ్ డిఎస్పి టి నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, కోర్టు లైసెన్ అధికారి ఎం గంగా సింగ్, ఐటి కోర్ సిబ్బంది మురాద్ అలి, ఎం శ్రీనివాస్ కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments