🔶 ఇంద్రవెల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన డి సునీల్
🔶 జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మొక్క అందించి బాధ్యతలు స్వీకరించిన ఇంద్రవెల్లి ఎస్సై
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు నూతనంగా ఇంద్రవెల్లి స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా నియమించబడిన ఎస్ఐ *డి సునీల్* జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా మొక్క అందించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇంద్రవెల్లి మండలంలో గుట్కా, మట్కా, జూదం, గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించేలా తన కార్యచరణను నేటి నుండే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్, పెట్రో కార్, బ్లూ కోర్ట్, స్టేషన్ రైటర్, సెక్షన్ ఇంచార్జ్ లాంటి వర్టికల్స్ ను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని సూచించారు. కేసుల దర్యాప్తును ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలో జన్మించి 2018 సం” ఎస్సై బ్యాచులో పోలీసు ఉద్యోగంలో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన డి సునీల్ తొలుత రెండు సంవత్సరములు సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించి ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లాకు బదిలై గత మూడు నెలలుగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు రెండవ ఎస్సైగా విధులు నిర్వర్తించడం జరిగింది. ఇటీవలే ఇంద్రవెల్లి ఎస్ఐ ఎన్ నాగనాథ్ ఆదిలాబాద్ హెడ్ కోటర్స్ కు అటాచ్ పై వెళ్లిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న స్థానాన్ని డి సునీల్ ను ఎస్ఐగా నియమిస్తూ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, క్యాంప్ సిసి దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments