Friday, November 22, 2024

అకారణంగా కొట్టారని మనస్తాపం చెంది ఒకరి ఆత్మహత్య…..

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవ ల సమయంలో గొడవల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ఫరిద్ తెలిపిన వివరాల జున్ని గ్రామానికి చెందిన కదం వసంత్ రావ్ అనే వ్యక్తి కి ఒక కొడుకు పెరు కదం నగేష్ (30) , ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రకారం గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవ సమయంలో డాన్స్ చేసే విషయంలో కదం నగేష్ మరియు గ్రామంలో ని సుంకరి పృథ్వి రాజ్, చంద్రయ్య, లోకేష్ ,రామ్ కిషన్ ల మధ్య గొడవ జరిగింది. అయితే లోకేష్ , పృథ్వి రాజ్ లు కదం నగేష్ ల మధ్య కొట్లాట జరిగింది. గొడవ దగ్గర నుండి ఇంటికెళ్లిన నగేష్ తనను అక్కడ కొట్టారని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఆ తర్వాత రాత్రి అందరూ పడుకున్న సమయంలో వ్యవసాయం కోసం తెచ్చుకున్న మోనో సీల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజూ ఉదయం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. కొట్టడం వల్లే అవమానం తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి