ePaper
Sunday, March 15, 2026
📄 ePaper

వడదెబ్బతో వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్:

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని రాజుల గూడా గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళితే మండలంలోని అనంతపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల రాజుల గూడ గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఆదివారం వడదెబ్బతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం తన వ్యవసాయ చేనులో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళిన బాలాజీ దుక్కి దున్ని మధ్యాహ్నం ఇంటికి వచ్చి కడుపులో నొప్పిగా ఉందని తెలిపాడు. కొద్దిసేపటి తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు ఆయన కుమారుడు కృష్ణ తెలిపారు. బాలాజీ భార్య కూడా మృతి చెందింది. మృతునికి ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమార్తెల వివాహం కాగా, కుమారుల వివాహం కాలేదని స్థానికులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!