సాత్నల మరియు వడ్డాడి ప్రాజెక్టుల వద్ద నిర్వహించనున్న మోక్ డ్రిల్
Thank you for reading this post, don't forget to subscribe!– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా దేశద్రోహులను టెర్రరిస్టులను మట్టు పెట్టడానికి నిర్వహించబడుతున్న ఆక్టోపస్ బృందం ఆదిలాబాద్ జిల్లాలోనికి రెండు రోజులపాటు శిక్షణ నిమిత్తం విచ్చేసిందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇందులో భాగంగానే బుధవారం జైనథ్ మండలం సాతనాల ప్రాజెక్టు వద్ద ప్రాజెక్టును దేశద్రోహులు టెర్రరిస్టులు స్వాధీనపరచుకుంటే ఎలా నిరువరించాలి అనే అంశంపై ఈ బృందాలు శిక్షణను ఆక్టోపస్ డిఎస్పి ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈరోజు ఆక్టోపస్ బృందంలో వివిధ రకాలైన అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి ప్రస్తుత సమాజంలోని శత్రువులను త్వరగా అంతమొందించడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమంలను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్, జైనథ్ సిఐ కే నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం వంశీకృష్ణ, ఎస్సై బి పెర్సస్, ఈ బృందాలకు సహాయంగా ఆదిలాబాద్ ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

Recent Comments