నింగికి రాకెట్లను పంపుతున్న ఆధునిక యుగంలో కొంతమంది క్షుద్రపూజలు నమ్ముతుండడం ఆశ్చర్యం కలిగించక మానదు. టెక్నాలజీ తో పోటీపడుతున్న ఈ కాలంలోను మూఢనమ్మకాలు గ్రామాల్లో ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు విద్యార్థులతో పాటు స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ బడిలో కి చొరబడిన ఆగంతకులు క్షుద్ర పూజలు చేశారు. బడిలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ, సున్నంతో ముగ్గు వేసి అందులో కోడిగుడ్డు, నిమ్మకాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇది ఆకతాయిలు చేసిన పనా? లేక నిజంగానే క్షుద్ర పూజలు చేసారా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


Recent Comments