రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన నంద అనే మహిళ తనకు వారం రోజుల క్రితం పుట్టిన బాబును పోషణ భారమై, బతుకు తెరువు కై, ఇచ్చోడకు చెందిన ఒక వ్యక్తికి 18000 రూపాయలకు అమ్మగా, బాబును కొన్న వ్యక్తి ఆ బాబును నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలకు అమ్మడముతో ఈ విషయం బయటకు పొక్కడముతో గురువారం సాయంత్రం ఇచ్చోడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇచ్చోడ లోని శిశుమందిర్ ప్రాంతములో బాబును పట్టుకుని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తల్లి , బిడ్డను ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా ఇచ్చోడ సి ఐ ముదావత్ నైలు, ఇచ్చోడ ఎస్ ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. కేసు పూర్తి వివరాలను లీగల్ అడ్వైజ్ ప్రకారము తెలియచేస్తామని తెలిపారు.

కారణాలు ఎన్ని ఉన్నా, ఏన్నీ సమస్యలున్న నవమాసాలు మోసిన కన్న తల్లే,కడుపు కోతను దిగమింగి అంగడి సరుకుల 10 దినాలైన నిండని పసి బాబును అమ్మకానికి పెట్టడం మాత్రం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
అయితే ఆమె కు పేదరికం ఈ దారి వైపు అడుగులు వేసేలా చేసినట్లు తెలుస్తోంది. సదరు మహిళకు ఇప్పటికే ఆరుగురు పిల్లలున్నారు. పుట్టిన బాబు ఏడవ వాడు కావడం… ఇప్పటికే ఉన్న పిల్లల పోషణ భారం తట్టుకోలేక , కనీసం పుట్టిన కొడుకైన మంచి జీవితం గడుపుతాడానే ఉద్దేశ్యంతోనే అమేసినట్లుగా తెలుస్తుంది.
Recent Comments