రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కొందరు టార్గెట్ చేసి బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది...!? తాజాగా ఓ వెంచర్ రియల్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న వాయిస్ కాల్ రికార్డును సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అదే విధంగా కొన్ని మీడియా ఛానళ్లు సైతం ఉదయం నుంచి బ్రేకింగ్ న్యూస్ పేరిట వివాదంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేరిట న్యూస్ ప్రచారం అవుతుంది.
అయితే వాస్తవానికి ఆ ఆడియో కాల్ విన్న తర్వాత మనకు అందులో తెలుస్తున్నది ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ప్లాట్ల కొనుగోలు వ్యవహారంలో ఎమ్మెల్యే రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది. అయితే సదరు రియల్టర్ సమయానికి డబ్బులు అందకపోవడంతో మధ్యలో ఉన్న వ్యక్తిని మాత్రమే డబ్బులు అడుగుతూ ఉండడంతో డబ్బుల కోసం తనకే ఫోన్ చేయాలని నేను కదా ఇవ్వాల్సింది అని ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది.
డిటిసిపి అనుమతులు అన్ని అనుమతులు పొంది ఉంటేనే డబ్బు చెల్లిస్తా అని రకంగా మాట్లాడి ఉంటే ఆ వాయిస్ కాల్ రికార్డులు ఎలాంటి తప్పులేదు నువ్వు ఎలా లేఔట్ లు తీసి అమ్ముతావు అనుమతులు తీసుకోకుండా అనడంలో కూడా తప్పులేదు రిపబ్లిక్ హిందుస్థాన్ ఆక్రమాలపై ఆక్ర మళ్ళి ఆట్లపై కొండా జడిపించాలి పక్షాన కూడా ఉంటుంది ఆక్రమణ లేఔట్ ల పై గళం ఎక్కుతారు వారి పక్షాన కూడా నిలబడుతుంది
అయితే వాస్తవానికి బోథ్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు నీ లే అవుట్లు అనుమతులు తీసుకుని చేస్తున్నావో దాని గురించి కూడా నేను తెలుసుకోవాలని మాట్లాడటంలో ఏ మాత్రం తప్పులేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కు తన నియోజకవర్గ ఫరిదిలో ప్రజల కోసం జరిపే ఎలాంటి కార్యక్రమాన్ని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.
ఎమ్మెల్యే రియల్టర్ను నీ లేఅవుట్ కు అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మాట్లాడడంలో తప్పులేదు. ఎందుకంటే డబ్బులు ఇయాల్సింది ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి కాబట్టి , లేఅవుట్ గురించి నీకు అనుమతి ఉన్నదా లేదా అని తెలుసుకోవడం కోసం చేసిన వాక్యాలను వివాదాస్పద వ్యాఖ్యల పేరిట కొన్ని మీడియా ఛానళ్లు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.
బోథ్ నియోజవర్గంలో జోరుగా అక్రమ లే అవుట్లు
ఇచ్చోడా, భజరత్నూర్, బోథ్, నేరడిగొండ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆక్రమణలపై స్పందించడం శుభ పరిణామం. అయితే సక్రమమైనదా లేదా అది తెలుసుకునే డబ్బు ఇస్తా అనడంలో ఏలాంటి తప్పు లేదు కదా. అయినా ఇది రాజకీయంగా బురదల్లే ప్రయత్నమేన ... !?
బోథ్ నియోజకవర్గంలో రాజకీయం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత వేడెక్కుతుంది. అయితే గతంలో కూడా ఓ ఎంపీడీవో విషయంలో కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఈ రాజకీయ వాతావరణం ఏ వైపుకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
అక్రమ లే అవుట్ల పై రిపబ్లిక్ హిందుస్థాన్ కథనాలు….
రిపబ్లిక్ హిందుస్థాన్ గత కొన్ని రోజులుగా ఆక్రమ లే అవుట్లపై అదే విధంగా డిటిసిపి పేరిట అనుమతులు పొంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి పనులు అందులో చేయకుండా ప్లాట్ల అభిప్రాయాలు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. వాస్తవానికి గతంలో ఇచ్చోడాలో కొన్ని రోజుల క్రితం అక్రమాలు లేఔట్ లో పక్కోడి భూమిని సైతం లేఅవుట్లో కలుపుకొని అమ్ముకున్న సంఘటన బయటకు వచ్చింది. అయితే అది బయట అధికారులకు దాకా వెళ్ళకపోవడంతో అది ప్రజల ముందుకు రాలేదు. అయితే అందులో ప్లాట్లు కొనుగోలు చేసుకున్నటువంటి వ్యక్తులు వారికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇచ్చోడ మండల కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అక్రములు కొనసాగుతున్న రిపబ్లిక్ హిందుస్థాన్ వాటిని అధికారులు దృష్టిసారించేదుకు కథనాలు రాసిన జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గ్రామపంచాయతీ స్థాయి అధికారులు సైతం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలు బహిరంగంగానే ఇది మామూలు విషయమే అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఆక్రమణలపై కొరడా జులిపిస్తే ఇలాంటి వాటికి కళ్లెం వేయవచ్చు. ఎమ్మెల్యే స్థాయి అధికారి కూడా నేను నీ లేఅవుట్ సక్రమమైన లేదా తెలుసుకొని నీకు పేమెంట్ చేస్తాను అనే సాయికి వచ్చిందంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందే.
గతంలో కూడా ఓ అధికారిణి స్కామ్ విషయంలో ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అప్పుడు కూడా ఈ రకంగానే ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం చేసినట్లుగా తెలుస్తోంది . కేవలం ప్రశ్నించినందుకే వివాదంలో ఇరుక్కుంటారా…!? ఎమ్మెల్యేగా ఉంటే ప్లాట్లు కొనుగోలు హక్కు ఉండదా!? ఎమ్మెల్యేగా ఉంటే ప్లాట్లు కొనుగోలు చేయరాదు…. అనే నిబంధనలు ఎక్కడైనా రాసి ఉన్నాయా.
వాస్తవానికి ఎమ్మెల్యే అడిగింది కేవలం నీ లే అవుట్ల కు అనుమతులు ఉన్నాయా…? అనుమతి పొంది… తీశావా…!? అనే కదా ప్రశ్నించింది….! మరి ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది…?
వాస్తవానికి రిపబ్లిక్ హిందుస్థాన్ సూచించేది ఒక్కటే నేడు ఎమ్మెల్యేకు సైతం ఈ పరిస్థితి ఏర్పడింది అంటే …. భవిష్యత్తులో మీరు కొనుగోలు చేస్తే లేఅవుట్లు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా…? లేవా అనేది తెలుసుకోవాలని ..? కొనుగులు చేసే ముందు ఆచితూచి అడుగు వేయాలని రిపబ్లిక్ హిందుస్థాన్ ప్రజలకు సూచిస్తుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments