రామకృష్ణాపూర్: అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు.జిల్లా కేంద్రంలో డిసెంబర్ 8న నిర్వహించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం పై ఆయన మాట్లాడారు. అవినీతి అనేది అనేక శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న ఒక సామాజిక దురాచారం అని అన్నారు.అవినీతి పెచ్చరిలిందని, ఇది సమాజంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని,ఆర్థిక అభివృద్ధిని అణచివేస్తుంది అని అన్నారు. ప్రభుత్వ అధికారులు అంకితభావం, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పాన్ని మరచి లంచాల కోసం తెగ పడుతున్నారని అన్నారు. లంచం తీసుకుంటూ ఆదాయానికి మించి ఆస్తులు కూడపెడుతున్నారని అన్నారు. అవినీతికి పాల్పడినా ఉద్యోగం ఉంటుందనే ధీమాతో వీరి వైఖరి మారడం లేదని అన్నారు. పట్టుబడిన కొన్ని కేసులు పలు కారణాలతో వీగిపోతున్నాయని అన్నారు. దీనితో అవినీతి పెరిగిపోతుందన్నారు. అధికారులతో పని చేయించుకోవడం ప్రజలు తమ హక్కుగా భావించాలని, ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. కార్యక్రమంలో సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నాయకులు ఆడెపు సురెంధర్,కాగితపు సునీల్, నడిపెల్లి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments