Thursday, November 21, 2024

18 ఏళ్ల నిరీక్షణకు తెర…..

సంగంబండ పునర్వసుల అకౌంట్లలో దాదాపు 12 కోట్లు జమ.

కూలీ నిధుల విడుదలతో గ్రామస్తుల సంతోషం.

ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సత్కరించి, బాణాసంచా కాల్చి సంబురం

మక్తల్, రిపబ్లిక్ హిందుస్థాన్ :

సంగంబండ వాసుల 18 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. ఏళ్ల తరబడి సంగంబండ రిజర్వాయర్ నిర్మాణ కూలీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగంబండ గ్రామస్తుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. గత 18 ఏళ్లుగా మఖ్తల్ ప్రాంత శాసనసభ్యులు సంగంబండ పునరావాస నిధులు తీసుకురావడంలో విఫలం కాగా.నూతనంగా ఎన్నికైన లోకల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.కేవలం రెండు నెలల్లోనే 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజు నుంచే సంగంబండ పునరావాస నిధుల కోసం మంత్రులు చుట్టూ తిరిగి,ఇక ఇప్పట్లో రావనుకున్న కూలీ డబ్బులను సంగంబండ వాసుల అకౌంట్లలో వేయించారు.బుధవారం సాయంత్రం నుంచి వరుసగా సంగంబండ గ్రామస్తుల సెల్ ఫోన్లలో నిధులు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పునరావాస నిధుల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లకు దన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

400 మీటర్ల బండరాయి తొలగించేందుకు మార్గం సుగమం.

భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగంబండ రిజర్వాయర్ 3.317 టీఎంసీల సామర్థ్యంతో 68వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించారు. అయితే రిజర్వాయర్ పూర్తయినా,ఎడమ లో లెవల్ కెనాల్ కింద దాదాపు 7వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు మాత్రం ఇంకా ప్రారంభించనేలేదు. ఎడమ లో లెవల్ కెనాల్ కింద మఖ్తల్ మండలంలోని గూర్లపల్లి, దాసర్ దొడ్డి, వనయకుంట, తిర్మలాపూర్, మాగనూరు మండలంలోని వడ్వాట్, అమ్మపల్లి, అడవిసత్యారం, మాగనూరు ప్రాంతాల్లో 7వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే 400 మీటర్ల మేర బండరాయి ఉండటంతో,బండరాయిని తొలగిస్తేనే ఎడమలోలెవల్ కెనాల్ పనులు ప్రారంభమవుతాయి. అయితే సంగంబండ గ్రామస్తులకు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా కూలీనిదులు దాదాపు 12కోట్ల మేర డబ్బులు రావాల్సి ఉండటంతో ప్రతిసారీ బండరాయి తొలగింపు పనులను అడ్డుకుంటూ వచ్చారు. తాజాగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవతో సంగంబండ గ్రామస్తులకు 12కోట్ల వరకు నిధులు జమ కావడంతో బండరాయి తొలగింపునకు మార్గం సుగమమైంది. అతిత్వరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించి, బండరాయి తొలగింపు పనులు ప్రారంబించి, త్వరలోనే ఎడమ లో లెవల్ కెెనాల్ కింద ఉన్న గ్రామాలకు సైతం సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. దీంతో ఆయాగ్రామాల ప్రజలు ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యకు వాకిటి శ్రీహరి కేవలం రెండు నెలల్లోనే పరిష్కారం చూయించారని, స్థానికుడైన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నిక కావడంతో ఇది సాద్యమైందని హర్షం వ్యక్తం చేసారు. ఇటు సంగంబండకు చెందిన నేతలు బాలక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, స్తానిక నేతలు చెన్నారెడ్డి, నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ కేశవరెడ్డి, ఇతర నేతలు, యువకులు, గ్రామస్తులు సైతం నిధుల రాకతో సంతోషం వ్యక్తం చేశారు. 18ఏళ్ల నిరీక్షణకు తెరదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి