గత కొన్నీ నెలలుగా ఇచ్చోడ ప్రజలు నిరసన తెలుపుతున్న చలనం లేని అధికార యంత్రాంగం ….
పట్టణ నడిబొడ్డులో ప్లెక్సీలు పెట్టి కాలనీ సమస్యలు బహిరంగ ప్రదర్శన చేస్తున్న వైనం
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యం తో , పరిసరాల్లో శుభ్రత పాటించేలా కోట్లు ఖర్చు చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫలితం శూన్యం. స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు.
ఇచ్చోడ గ్రామపంచాయతీ నిర్లక్ష్యం పై నిరసన
గ్రామాలు పట్టణాల్లో అభివృద్ధి,పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించింది. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగక పారిశుధ్యం లోపించి కాలనీలు దుర్గంధ భరితమైనాయి.

తద్వారా కాలనీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ కాలనీలను అభివృద్ధి చేయాలని, తమ కాలనీ లోని సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన కూడా తమ సమస్యలు పరిష్కరించడలేదని కాలనీవాసులు, యువకులు ఇచ్చోడలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

తమ కాలనీలలో ఉన్న దుర్గంధ భరితమైన ఫోటోలు తీసి ప్లెక్సీ రూపంలో తయారు చేయించి ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన తెలిపారు. తమ కాలనీ లోని సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఫ్లెక్సీలు తీసేది లేదన్నారు. త్వరలోనే ఈ సమస్యలపై ఇచ్చోడ నుండి ఆదిలాబాద్ కు పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు తమ కాలనీలలోని సమస్యలు పరిష్కరించాలని విన్నవించనున్నారు.


Recent Comments