Friday, November 22, 2024

హత్య యత్నం ప్రేమ వ్యవహారమే.. పరారీలో కౌన్సిలర్ రఘుపతి



ప్రేమ వ్యవహారంలో కిరాయి హంతకులతో హత్యాయత్నం చేయించిన ఉష్కేం రఘుపతి – ఆదిలాబాద్ డిఎస్పీ వి ఉమెందర్*

*15 లక్షల తో హత్యకు ఒప్పందం*

*వంశీ అనే యువకుడికి తీవ్రగాయాలు,*

*ఈ కేసులో ఆరుగురు పై కేసు నమోదు, నలుగురి అరెస్ట్,*

*నిందితులైన మావల కౌన్సిలర్ ఉష్కెం రఘుపతి, భార్య పరారీ.*

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ లో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో కీలక వివరాలను ఈరోజు స్థానిక మావల పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఆ క్రమంలోఆదిలాబాద్ లోని మావల కౌన్సిలర్ రఘుపతి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన వ్యక్తి అతనికి ఒక కూతురు, ఆమె ఎస్సీ కులస్తుడైన వంశీతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడం జరిగింది. అది తెలిసిన రఘుపతి వంశీని రెండు సంవత్సరం క్రితం ఆయన ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లి మళ్లీ తన కూతురు వెంటపడితే చంపేస్తాను అని బెదిరించి పంపినాడు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం తెలుసుకున్న రఘుపతి అతనిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.
చౌహన్ రవి కెఆర్కె కాలనీకి చెందిన వ్యక్తి ఇతను గతంలో జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ముద్దాయి. గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చినాడు. జైలు నుండి వచ్చిన తర్వాత రవి మరియు అతని మిత్రుడు అశోక్ ఇద్దరు కలిసి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తేది 25.11.2023 రోజున శాంతినగర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు రవి మిత్రుడైన ఉష్కేం రఘుపతితో కలవగా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావు అని అడిగగా దొంగతనం కేసులో జైలు నుండి వచ్చినానని రవి తెలిపినాడు.
ఒక వ్యక్తిని జీపుతో గుద్ది చంపాలి అని చెప్పి అందుకు 15 లక్షల రూపాయలు ఇస్తానని రఘుపతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎందుకంటే జీపుతో గుద్దితే యాక్సిడెంట్ కేసుగా నమోదు అవుతుందని అతని మీద అనుమానం రాదు అని అడ్వాన్సుగా రఘుపతి రవికి లక్ష రూపాయలు ఇచ్చి ఎన్నికల తర్వాతనే హత్య జరగాలని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు.
తేదీ 28/11/2023 నాడు రవి మరియు అశోకులు దస్నాపూర్ రఘుపతి ఆఫీస్ కి వెళ్లగా ఆఫీస్ ముందు నుండి యాక్టివా బండి పై వెళ్లిన వంశీ అనే యువకుడిని చూపించి ఇతనిని చంపాలి అని చెప్పారు. ఆ తర్వాత రఘుపతి అతని క్రెటా కారులో వీరిద్దరిని తీసుకువెళ్లి వంశీ యొక్క ఇల్లు చూపించినాడు. అతని భార్య కూడా వంశీ ఎలాగైనా చంపాలని వాళ్ళ పరువును కాపాడాలని వీరిద్దరిని కోరారు.

రవి ఐదు లక్షలు అశోక్ కు ఇస్తాను అని చెప్పాడు. అక్కడినుండి వీరిద్దరూ వంశీ ఇంటికి వెళ్లి రక్కి నిర్వహించారు. రవి, అశోక్ కు ఒక జీపును కావాలని చెప్పగా అశోక్ అతని మిత్రుడైన దిల్షాద్ కు చెప్పి ఏదైనా ఒక పాత జీపు కావాలని అడిగినాడు, అందుకు జీపు ఓనర్ కు 20,000 రూపాయలు మరియు మాట్లాడినందుకు మరియు దిల్షాద్ కు 20వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. దిల్షాద్ జీప్ ఓనర్ రాజుతో ఫోన్లో మాట్లాడి వినాయక చౌక్ లో కలుసుకున్నారు. జీపుతో ఒకరిని ఢీ కొట్టి చంపాలి ఉన్నదని 20000 ఇస్తానని ఒప్పుకున్నారు.
17/12/2023 రోజున రవి, అశోక్లు 50,000 ఇచ్చి జీప్ తీసుకుని రమ్మని రవికి చెప్పగా, అశోక్ దిల్షద్ తో మాట్లాడి అతనికి 20000 ఇవ్వగా, దిల్షాద్ రాజుకు 10000 ఇచ్చి మిగితా పది వేలు తను తీసుకున్నాడు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి అశోక్, కమాండర్ జీపును తీసుకొని కేఆర్ కే కాలనీ కి వెళ్ళాడు. ఆ తర్వాత రవి మరియు అశోకులు ఇద్దరూ సాయంత్రం వంశీ ఇంటి వైపు ఒకసారి వెళ్లి వచ్చారు.
వంశీ ఉదయం 5 గంటల తర్వాత పాల కోసం మణిపూర్ కాలనీ మిల్క్ డేరి కి వెళ్లి అక్కడి నుండి ఆదిలాబాద్ టౌన్ కు వెళ్తాడు అని తెలుసుకున్నాడు.
తేదీ 18/12/2023 రోజున ఉదయం 5 గంటలకు రవి మరియు అశోకులు ఇద్దరు కేఆర్కే నుండి కమాండర్ జీపులో కొత్తవాడ కు వెళ్ళినారు. అక్కడ అశోక్ జీప్ డ్రైవ్ చేయగా రవి వెనకాల కూర్చుని కొత్త వాడ మూలమలుపు దగ్గర బండి ఆపి వంశీ కొరకు వేచి ఉన్నారు. సుమారు 5:30 గంటలకు వంశీ తన స్కూటీ బండి పై తన ఇంటి నుండి మావల ప్రధాన రహదారికి రాగానే అశోక్ బండి స్టార్ట్ చేసి అతని బండి వెనకాలే వెంబడించి స్మశాన వాటిక దగ్గరలో రాగానే ఒక్కసారిగా వేగం పెంచి వెనక నుండి బలంగా గుద్ధగా వంశీ కిందపడి బండి పక్కన పడింది మళ్లీ రివర్స్ తీసుకొని ముందుకు వెళ్లే క్రమంలో జీపు ఎలక్ట్రిక్ పోలుకు తగిలి, పోలు విరిగి యాక్టివా బండిపై పడినది, అది చూసి వారు అక్కడి నుండి పారిపోయారు.
తదుపరి వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా మొదటగా రాజు దిల్షాద్ అశోక్ మరియు రవి లను అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్దనుండి సుమారు రూ 18,500/- నగదు , 4 మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిల్, ఒక కారు ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
మావల కౌన్సిలర్ రఘుపతి అతని భార్య పరారీలో ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సిఐ రూరల్, సీఐ జైనథ్, సిఐ సిసిఎస్, ఎస్ఐ మావల, ఎస్ఐ రూరల్ మరియు ఐడి పార్టీ రమణయ్య, కరీం మరియు CCS పోలీస్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.




” Cr.No.344/2023 U/Sec 307,109 r/w 34 IPC, sec 3 of PDPP Act, Sec 3(2) (v) of SCs/STs (POA) Act-1989 of PS Mavala ”

*నిందితుల వివరాలు:*
A1) ఉష్కెం రఘుపతి (పరారీ)
A2) ఉష్కెం అరుంధతి (పరారీ)
A3) చౌహన్ రవి s/o బాబాన్, వయసు:32, నివాసం: కె ఆర్ కె కాలనీ ఆదిలాబాద్
A4) జి అశోక్ s/o గిరిజాజి, వయసు:25, నివాసం: కె ఆర్ కె కాలనీ ఆదిలాబాద్
A5) షేక్ దిల్షాద్ s/o ముస్తాక్ అహ్మద్, వయసు:30, నివాసం: అబ్దుల్లా చౌక్ ఖానాపూర్ ఆదిలాబాద్
A6) వి రాజు s/o బాపురావు వయసు:28, నివాసం: మేడిగూడ (v), జైనథ్ (m) .

కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ డిఎస్పీ వి ఉమెందర్ మీడియా సమావేశంలో వివరించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి