— జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించాలి
Thank you for reading this post, don't forget to subscribe!— ఉట్నూరు సబ్ డివిజనల్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మంగళవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు ఉట్నూరు సబ్ డివిజనల్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి. మొదటగా ఉట్నూర్ సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల వారీగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను తెలుసుకొని వాటిని సత్వరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా జిల్లా లో అసాంఘిక కార్యకలాపాలు అయినా గుట్కా, మట్కా, గంజాయి నిర్మూలించాలని దానికి తగ్గట్టుగా తమ ప్రణాళికను వేసుకొని అమలు పరచాలని సూచించారు. అదేవిధంగా నేర సమీక్షలో భాగంగా ఉట్నూర్ సబ్డివిజనల్ లో భాగంగా గా ఉన్న పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను, వాటి దర్యాప్తు స్థితిగతులను, న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసుల విచారణ ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేయాలని సూచించారు. గత నెలలో జిల్లా లోని అన్ని ఆర్టికల్స్ అనగా బ్లూ కోట్, పెట్రో కార్, సెక్షన్ ఇంచార్జ్, స్టేషన్ రైటర్, కోర్ట్, సమన్స్, ఎస్హెచ్ఓ,5 S అనే అంశాలలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారం అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే లోక్ అదాలత్ కోసం ఇప్పటి నుండి సన్ సిద్ధమై ఎక్కువ కేసులు పరిష్కారం కావడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్ శ్రీవాస్తవ, సిఐలు ఈ చంద్రమౌళి, సైదా రావు, రమేష్ బాబు, ఉట్నూరు సబ్ డివిజినల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లు, డిసిఆర్బి, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments