epaper
Saturday, January 17, 2026

సర్వే చేయరు… సమస్య పరిష్కారం కాదు… హద్దులు చూపెట్టక పోవడంతో రైతు మనోవేదన

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరిట రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.  అయితే భూప్రక్షాళన చేపట్టి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉదాహరణకు జామిడీ గ్రామంలోని హరన్ మారుతి అనే రైతుకు జామిడి శివారంలో ని 25 సర్వే నెంబర్ భూమి ఉంది.  తన భూమిని కొలిచి ఇవ్వాలని చెప్పేసి గత కొన్నేళ్లుగా మీ సేవ ద్వారా ఎంసీ ఫీజు కడుతున్నారు. ఎంసి ఫీజు కట్టిన ప్రతిసారి ఈరోజు రేపు అనుకుంటా రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకోవడమే తప్ప సమస్యను మాత్రం పరిష్కారం చేయడం లేదు.  ఎంతో విలువైన భూమి రోడ్డుకు మరో పక్కన ఉండడంతో,   ఆ భూమి పరులపాలయ్యే అవకాశం ఉంది. 

దీంతో ఆ రైతు తీవ్ర మనోవేదన గురవుతున్నాడు. ప్రభుత్వ రెవెన్యూ మ్యాప్ ప్రకారం ( నకాష ప్రకారం)  తన భూమిని తనకు కొలిచి ఇవ్వాలని చెప్పేసి సంవత్సరాలుగా ఎన్నిసార్లు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఎన్నోసార్లు ఎంసీ ఫీజు కట్టినా కూడా అధికారుల్లో స్పందన లేదు.  ఇప్పటికైనా తన సమస్యను గుర్తించి పరిష్కారం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. విలువైన భూమి పరుల ఆధీనంలో వెళితే పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఎవరి వారికి హద్దులు చూపెడితే ఎటువంటి సమస్య ఉండదని ఆ రైతు అధికారులను వేడుకుంటున్నాడు.

అధికారుల తీరుతో ప్రభుత్వానికి అపకీర్తి అపాదిస్తున్నట్లు అవుతుంది. సకాలం లో స్పందించి రైతు సమస్యలు పరిష్కారం చేస్తే… గ్రామాల్లో గాన్నీ, రైతుల మధ్య వివాదం పెరిగే అవకాశం ఉండదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!