పాఠశాల ఆవరణలో కాసేపు హై డ్రామా…
కత్తితో హల్చల్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు
-మధ్యాహ్న భోజనం డబ్బులు ఇవ్వాలని
రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే కార్మికురాలి భర్త తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ పాఠశాలలోకి కత్తి చేతిలో పట్టుకొని పాఠశాల ఆవరణలో హల్చల్ చేసాడు. ఆ వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాలేనందున వేరే వారిని పెట్టి వంట చేయిస్తున్నాం అని బియ్యం ఒక్కటే వాళ్ళు ఇస్తున్నారని మిగతా ఉప్పుతో కలిపి తొమ్మిది రకాల వస్తువులు తెచ్చి వంటలు చేస్తున్నాం అని అయినా గాని ఎన్ని సార్లు డబ్బులు అడిగిన ఇవ్వడం లేదంటూ ప్రధానోపాధ్యాయురాలు పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇంతలో పాఠశాల సిబ్బంది పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీస్ లు అతన్ని స్టేషన్ కి తరలించారు. ఈ ఘటన తో ఒక్కసారిగా పాఠశాలలో భయాందోళనకర వాతావరణం ఏర్పడింది.
దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులను వివరణ కోరగా సదరు వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడానని మధ్యాహ్న భోజన బిల్లులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సమయానికి బిల్లులు రాక సహనం కోల్పోతున్న ఘటనలు బయటకు వస్తున్న అధికారులు ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదని వాదన వినిపిస్తోంది.
Recent Comments