హైదరాబాద్: అక్టోబర్14 దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కొరకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను అందు బాటులోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్ లో దివ్యాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించ నున్నారు. ప్రత్యేక పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ప్రయివేటు కంపెనీల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను చూపించనుంది.
యూత్ ఫర్ జాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రత్యేక పోర్టల్‌ను సోమ వారం సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్క రిస్తారు..
Recent Comments