రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
Thank you for reading this post, don't forget to subscribe!ఫిబ్రవరి 9 న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు ఏరేకార్ శ్రీకాంత్ (తండ్రి ఏరేకార్ చందర్, తల్లి – పుష్పలత) రాష్ట్ర స్థాయిలో 228 వ ర్యాంకు, ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ స్వతహాగా ఇంట్లోనే చదివి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.
సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దనే చదువుతూ గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్ ను స్వల్ప తేడాలో ఉత్తీర్ణత కాలేకపోయాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయి తన సత్తా చాటాడు. దురదృష్టవశాత్తు రెండు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అయినా నిరాశ చెందకుండా గ్రూప్ 4 చదివి రాష్ట్ర స్థాయిలో మెరిశాడు. ఈ సందర్భంగా సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని శ్రీకాంత్ పేర్కొన్నారు.
Recent Comments