▪️జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ
రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (జనవరి 17): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాది కల్పన కార్యాలయం యందు ఈ నెల 20న మిని ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ తెలిపారు.

ఉద్యోగ మిని మేళాలో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ లోని అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్ట్ గా (డి.ఫార్మసీ బి.ఫార్మసీ ఎమ్ ఫార్మసీ) విద్యా అర్హత గలవారు అర్హులుగా పేర్కొన్నారు. అసిస్టెంట్ ఫార్మసీస్ట్,అప్రెంటిస్ ఫార్మసీ కి ఎస్ ఎస్ సి,ఇంటర్, డిగ్రీ తో పాటు సంబంధిత ఉద్యోగంలో అనుభవం ఉన్నవారు వివిధ హోదలలో పనిచేయుటకు18 నుండి 30 సంవత్సరాల వయస్సు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు కొరకు 9111731173, 6304600392, 8247656356 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Recent Comments