జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య వ్యవస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన 234 స్పెషలిస్టు డాక్టర్ల(Specialist doctor posts) నియామకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి(APMSRB) ఓ ప్రకటనలో తెలిపింది.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్, తదితర హాస్పిటల్స్ లో పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే అప్లయ్ చేయడానికి ముందు పోస్టుల వివరాలు,అర్హత,జీతం,ఎంపిక ప్రక్రియ,వయోపరిమితి,తదితర విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
విభాగాల వారీగా ఖాళీలు
జనరల్ మెడిసిన్- 38, ఓబ్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ- 37, పీడియాట్రిషియన్- 114, కార్డియాలజిస్ట్/ జనరల్ మెడిసిన్- 29, ఎపిడెమియాలజిస్ట్ – 15.
అర్హత
అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషాలిటీలో ఎంపీహెచ్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
42 ఏళ్లు దాటకూడదు
జీతం
నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు. ఎపిడెమియాలజిస్ట్ పోస్టులకు రూ.60,000.
ఎంపిక ప్రక్రియ
అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ
ఫిబ్రవరి 7,2024.


Recent Comments