Wednesday, October 15, 2025

జనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చిత్రం

రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
పాలకవీడు మండల కేంద్రంలోజనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకుడు సరికొప్పుల నాగేశ్వరరావు  మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.  నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.  మరియు  క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని పరిసర గ్రామాల జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!