1. అప్రమత్తతో సైబర్ నేరాల బారిన పడకుండా అడ్డుకోగలం.
2. ఈవారం జిల్లా వ్యాప్తంగా 15 సైబర్ ఫిర్యాదుల స్వీకరణ.
3. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్స్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటి నూతన పద్ధతులను వినియోగిస్తున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు
4. మోసపోయామని తెలిసిన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సంప్రదించాలి.
– – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్:
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతులను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రజలందరికీ అవగాహన అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అడ్డుకోగలమని తెలియజేశారు. ప్రస్తుతం వాట్సాప్ నందు టెలిగ్రామ్ నందు సోషల్ మీడియాలలో ఏపీకే ఫైల్స్ రావడం వాటి ద్వారా మొబైల్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం లాంటి సంభవిస్తుందని వాటిని అడ్డుకోవడానికి అప్రమత్తత ప్రధానాస్త్రంగా ఉంటుందని తెలిపారు.
ఒకవేళ మోసగాళ్ల చేత మోసపోయినట్లయితే వెంటనే (గోల్డెన్ హవర్) లో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయడం మొదటి కర్తవ్యం గా వ్యవహరిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ వారం రోజులకు గాను 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
అందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులు వినియోగిస్తున్న నూతన పద్ధతులు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, యూపీఐ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్లు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లాంటిది జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముఖ్యంగా యువత మాయమాటలకు నమ్మి మోసపోకుండా ఉండాలని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు వినియోగిస్తున్న పద్ధతిని తెలియజేస్తూ ఇన్వెస్ట్మెంట్ రాడ్లు ముఖ్యంగా డబ్బులను వారి సొంత వెబ్సైట్ ల నందు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా ఎక్కువగా చూపిస్తారని ఒకవేళ డబ్బులను తీయాలి అనుకుంటే రాకుండా ఉంటాయని ఉదాహరణను తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లా నందు నమోదైన పలు కేసుల వివరాలు.
🔹 ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కి వాట్స్అప్ ద్వారా బిజినెస్ చేస్తూ, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డబ్బులు ఆర్జించవచ్చు అని తెలిపి టెలిగ్రామ్ ద్వారా బాధితునికి ఒక లింకును పంపగా అతను హోటల్స్ కు రేటింగ్స్ ఇవ్వాలి అని తెలియజేశారని, దానికి నమ్మి దాదాపు 40 వేల రూపాయలు బాధితుడు యూపీఐ ద్వారా చెల్లించడం జరిగిందని తెలిపారు.
🔹 బేల మండలంలోని ఒక వ్యక్తికి, జనంలో ప్రజాదారణ పొందిన ఒక ప్రైవేటు వ్యక్తి పేరు పై నుండి మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి బాధితుని వద్ద నుండి అకౌంట్ కు సంబంధించిన వివరాలను తీసుకొని బాధితుని వద్ద నుండి 21 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించడం జరిగింది.
🔹 అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్ పరిధిలో సామాజిక మాధ్యమంలోని ఇంస్టాగ్రామ్ లో ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఆ వ్యక్తి పేరు పై కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు వీడియో కాల్స్ మరియు మెసేజ్ లు చేస్తూ వేధించడం జరుగుతుందని ఫిర్యాదుతో ఇంస్టాగ్రామ్ కు జిల్లా పోలీసుల తరఫున ఫేక్ అకౌంట్ ను తీసివేయాలని నివేదికను సమర్పించడం జరిగింది.
🔹 జైనథ్ మండలంలోని ఒక వ్యక్తికి ముద్ర ఫైనాన్స్ ద్వారా లోన్ వచ్చిందంటూ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి బాధితుడు కొంత డబ్బులను ముందుగా కట్టాలని తెలియజేస్తూ అతని వద్ద నుండి దాదాపు 22150/-రూపాయలను అతని వద్ద నుండి తస్కరించడం జరిగిందని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments