రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వై రమేష్ బాబు మృతి చెందారు. గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో నిర్మల్ లో సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించి, గత కొన్ని నెలల క్రితం ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. ఇచ్చోడ సర్కిల్లో కొన్ని నెలల విధులు నిర్వహిస్తూ అందరితో మమేకమై, శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో కీలకపాత్ర పోషించారు. ఫ్రీడమ్ ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విధులకు హాజరయ్యారు. స్టేషన్ కు వచ్చే ప్రజలతో కలివిడిగా ఉండే సీఐ మృతితో ప్రజలు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.



Recent Comments