రామకృష్ణాపూర్, ఏప్రిల్ 1 (రిపబ్లిక్ హిందుస్థాన్): రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ రెండో వార్డు జోడు పంపుల ఏరియా వద్ద వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ మానస హాజరై ప్రజలకు సిపిఆర్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ ఈ మధ్య చాలా మంది గుండె నొప్పి వచ్చి చనిపోతున్నారని నొప్పి వచ్చిన సమయంలో ప్రధమ చికిత్స చేస్తే బ్రతికే అవకాశం ఉందని తెలిపారు.ఎవరైనా ఉన్నట్టుండి సృహ లేకుండా పడిపోయినట్లయితే వారికి ఏం జరిగిందో పరిశీలించి వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలని,గుండె నొప్పి అని మనం గమనించినట్లయితే వారికి తగు ప్రథమ చికిత్స చేయాలని అది ఎలా చేయాలో ప్రజలకు అర్థమయ్యే విధంగా డాక్టర్ మానస అవగాహన కల్పించారు.అనంతరం వార్డు కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పిలవగానే డాక్టర్ వచ్చి ప్రజలకు సిపిఆర్,ఆరోగ్య విషయాల పట్ల పలు సూచనలు సలహాలు చేయడం జరిగిందని తెలిపారు.ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్లు చెప్పిన విధంగా సలహాలు సూచనలు పాటిస్తూ దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే తగువిధంగా మందులు వాడుతూ డాక్టర్ల సలహా పై ఆరోగ్యకరమైన ఆహారం తినాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త వెంకటలక్ష్మి మాజీ ఎంపిటిసి కళ్యాణ్, బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్,సతీష్,రవి,పాష,లక్ష్మణ్, గణపతి,చంద్రయ్య,బాలాజీ, ఎల్లయ్య,మహిళలు పాల్గొన్నారు.
CPR PROCESS : సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
Next article


Recent Comments