Wednesday, June 25, 2025

33 జీవో తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం – ఎమ్మెల్యే హరీష్ రావు

హైదరాబాద్ :  మెడికల్ అడ్మిషన్ల కోసం రేవంత్ సర్కార్ తీసుకొ చ్చిన జీవో 33పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ జీవోతో తెలంగాణ విద్యా ర్థులు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ఏ అంశంపైన కూడా కనీస అవగాహన లేని ప్రభుత్వం.. అడ్డదిడ్డంగా పాలన సాగిస్తోందన్నారు. చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితే లోకల్ గానే పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. పొరపాటున మన పిల్లలు బయటకు వెళ్లి రెండేళ్లు చదివితే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు.


ప్రభుత్వానికి చేతకాకపోతే గతంలో బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన జీవోను ఫాలో అయితే సరిపోయేది కదా అంటూ కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో పాలన అడ్డదిడ్డంగా మారిందని ధ్వజమెత్తారు.

మెడికల్ సీట్ల అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సరిగా లేవని విమర్శించారు. రేవంత్ సర్కార్ తెలంగాణ విద్యార్థు లకు అన్యాయం చేస్తోంద న్నారు. ప్రభుత్వ నిబంధ నలతో తెలంగాణ విద్యార్థు లు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు.

స్థానికులకే 95 శాతం ఉద్యో  గాలు దక్కేలా నిబంధనలు మార్చామని గుర్తు చేసిన హరీశ్ రావు.. విద్య విష యంలో కూడా అలా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల పాటు విద్యా విధానం యధావి ధిగా కొనసాగాలని పునర్వి  భజన చట్టంలో ఉందన్నా రు. అందుకే మేము చేయలే కపోయాం అనితెలిపారు.

తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కొత్త కళాశాలలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వ నిర్ణయంతో బి కేటగిరి సీట్లు కూడా తెలం గాణ విద్యార్థులకే దక్కాయ న్నారు. తెలంగాణ రాష్ట్రం స్థానికతను నిర్ధారించుకు నేందుకు ఈ విడత అవకా శం వచ్చిందన్నారు..


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి