ఐదు నెలల గర్భస్థ శిశువు లభ్యంతో కేసు పురోగతి*
Thank you for reading this post, don't forget to subscribe!పి.ఎం.పి డాక్టర్ అరెస్ట్
*గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, విచారణ*
*
అదిలాబాద్ : గుడిహత్నూర్ మండలానికి సంబంధించిన ఒక బాధితురాలని ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తన అర్హతకు మించి వైద్యం అందించి బాధితురాలని అస్వస్థతకు గురికావడానికి కారణమైన పిఎంపీ డాక్టర్ సూర్యవంశీ దిలీప్ s/o శేషారావు, గుడిహత్నూర్, ఈరోజు మెడికల్ కౌన్సిల్ ద్వారా సరైన నిర్ధారణ చేసుకొని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని, అరెస్టు చేయడం జరిగిందని ఉట్నూర్ ఎ ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. బాధితురాలికి గర్భం దాల్చి ఐదు నెలల సమయంలో గర్భం పోవడానికి కావలసిన టాబ్లెట్లను చట్ట వ్యతిరేకంగా ఇచ్చినందుకుగాను డాక్టర్ పై ఎంపీపీ ఆక్ట్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ను ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వైద్య శాఖ వారు అందించిన సమాచారం మేరకు డాక్టర్ కు అర్హత లేదని తెలిసిన వెంటనే డాక్టర్ పై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేసి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Recent Comments